Loading...

గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీ-రివ్యూ

gps-review
చిత్రం:గౌతమి పుత్ర శాతకర్ణి
నటీనటులు:బాలక్రిష్ణ,శ్రియ,హేమ మాలిని,శివరాజ్ కుమార్,కబీర్ బేడి తదితరులు
దర్శకత్వం,కథ,స్క్రీన్ ప్లే:క్రిష్
సంగీతం:చిరంతన్ భట్
నిర్మాతలు:వై.రాజీవ్ రెడ్డి,సాయిబాబు జాగర్లమూడి
బ్యానర్:ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
సినిమాటోగ్రఫి: జ్గ్ణానశేఖర్ వీయస్
ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్,రామక్రిష్ణ అర్రం..
బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న 100 వ సినిమా.అభిమానులలో భారీ అంచనాలు అంతేకాదు ఎలాంటి క్యారెక్టర్ లో బాలయ్య ను మనం 100 వ సినిమా లో చూస్తాము అని ఎంతో మంది అభిమానులు వేచి ఉన్నారు.అయితే ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరుస్తూ క్రిష్ దర్శకత్వం లో సినిమా అది కూడా చారిత్రాత్మక నేపధ్యం ఉన్న శాతకర్ణి కథ అందరిలోనూ టెన్షన్ క్రిష్ ఈ సినిమా ఎలా తీస్తాడా అని అయితే ఒక్క ట్రైలర్ తో అందరి అనుమానాలకు తెరదించేశాడు.కేవలం 80 రోజులలోపే షూటింగ్ అయిపోయింది.సినిమా చాలా బాగా వచ్చింది అని చెబుతున్నా గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమా అంత తొందరగా వస్తుందా అని భావించారు అన్నిటిని అధిగమించి క్రిష్ ఈ సంక్రాంతికి సినిమాను మన ముందుంచాడు.ఈ కథ క్రీ.పూ సంభంధించినది అంతేకాదు ఆ రాజు మన ఆంధ్ర ప్రాంత వాసి అయితే ఎన్నో నచనాలు పెట్టుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బాలయ్య 100 వ సినిమా మరి అందరిని అలరిస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే మరి….

కథ:

అది క్రీ.శే 1-2 శతాబ్దాల నాటి కథ.ఇక అప్పట్లో భారతదేశాన్ని చాలా మంది రాజులు పాలిస్తూ ఉండేవారు (చిన్న గణతంత్ర రాజ్యాలుగా)ఉండేవి.అయితే చాలా మది రాజులు పక్కన రాజ్యాలలో జరుగుతున్న అన్యాయాలను ఏమి పట్టించుకోకుండా తమ పాలన ,తమ రాజ్యం అనంట్లు ఉనండేవారు.అయితే కొంతమంది ఆంగ్లేయులు కూడా భరతఖండాన్ని తమ స్వాధీనం చేసుకోవడానికి ఎంతో దారుణానికి తెగపడేవారు.ఎంతోమంది రాజులు తమ భాధలను తట్టుకోలేక వారికి సామంతులు అవుతారు.ఇక ఆంగ్లేయులు తమ అరాచకాన్ని ఎక్కువ చేస్తారు.ఇక అప్పట్లో శాతవాహనుల రాజు గౌతమి పుత్ర శాతకర్ణి .వారి వంశం లోనే చాలా బలమైన రాజు శాతకర్ణి.ఇక ఇదంతా గమనిస్తూ వస్తున్న శాతకర్ణి ఎలాగైనా ఆంగ్లేయులని మన దేశం నుంచి తరిమి కొట్టి వారి ఆగడాలను అరికట్టాలని నిశ్చయించుకుంటాడు.అయితే ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు కాబట్తి మిగతా రాజ్యాలలోని రాజులకు కలసి పోరాడదామని చెప్పగా వారు కూడా శాతకర్ణి తో ఏకమయ్యి ఆంగ్లేయులపై దండయాత్ర కొనసాగిస్తూ ఉంటారు.అయితే శాతకర్ణి ని ధైర్యం గా ఎదురొడ్డి ఎదుర్కోలేని ఆంగ్లేయులు శాతకర్ణి తో కలసి పనిచేసే రాజును ఒకరిని మచ్చిక చేసుకుని అతనికి ఆశ చూపించి శాతకర్ణి సామ్రాజ్యం లో ఉన్న పలు రహస్యాల గురించి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాడు.సైనికుల బలగాలు,శాతకర్ణి బలహీనతల గురించి ఇతను చేరవేస్తూ ఉండేవాడు.అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న శాతకర్ణి అసలు ఆ రాజును ఏం చేఅడు?వారి వ్యూహలను ఎలా ఎదుర్కొన్నాడు?మిగతా రాజ్యాలను ఎలా చేజిక్కించుకున్నాడు?ఆంగ్లేయులను ఎలా తరిమి కొట్టాడు అన్నదే తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మరి..

విశ్లేషణ:

ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు కావాల్సిన పెద్ద పెద్ద భవనాలు,వేలాది మంది సైనికులు,కళ్ళు చెదిరే యుద్ధ సన్నివేశాలు,ఆనాటి రాజుల భవంతులు అలాగే ఇలా అన్ని సెట్ చేసుకుని షూట్ చేసి దానికి కావాల్సిన గ్రాఫిక్స్ వర్క్ మొత్త ఇదంతా పూర్తి కావాలి అంతే దాదాపు ఏడాదిన్నర కాలం పడుతుంది అయితే ఈ సినిమా ను కేవలం 7,8 నెలల్లో పూర్తి చేసి అదికూడా క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా క్రిష్ ఈ సినిమాను పూర్తి చేశాడు అంటే ముందుగా ఆయన చేసిన పనికి మనందరం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ఎందుకంటే ఆయన తీసిన సినిమా కథ ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నాటి గూప చరిత్ర దానిని మన తెలుగు వారందరూ కాదు కాదు మన ఇండియా అంతా గర్వపడేలా తెరకెక్కించి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి అర్దమయ్యేలా అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించాడు.

కథ కూడా మొదలవ్వడం చాలా ఆశక్తిగా ఉంటుంది ఇక ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు అందరిని గుండెకు హత్తుకునేలా ఉంటాయి ఇక మొదటి భాగం లో వచ్చే యుద్ధ సన్ని వేశాలు చాలా బాగుంటాయి అలాగే ఈ సన్నివేశాలలో ఒకటైన సముద్రం లో జరిగే యుద్ధ సన్ని వేశం చాలా కొత్తగా మరియు అందరిని ఆశ్చర్యపరచేలా ఉంటాయి.ఇక శాతకర్ణి తన తల్లి గౌతమి బాలాశ్రీ కు మధ్య వచ్చే సన్ని వేశాలు ముఖ్యం గా తన భార్య మధ్య వచ్చే సన్ని వేశాలు రొమాంటిక్,ఎమోషనల్ రెండూ అందరిని ఆకర్షిస్తాయి.ఇక రెండవ భాగం లో వచ్చే యుద్ధ సన్ని వేశాలు కూడా అందరిని మైమరపిస్తాయి.వీటిని క్రిష్ చాలా వైవిధ్యం గా తెరకెక్కించాడు అప్పటి కాలానికి తగ్గట్లుగా అలాగే ఈ సినిమా నిడివి కూడా 2 గన్ 15 నిముషాలు కావడం కూడా చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.ఎందుకంటే సినిమా ఎక్కడా బోర్ కొట్టడు చాలా ఆశక్తిగా సాగుతూ పోతుంది.అలాగే ఈ సినిమా యుద్ధ సన్ని వేశాలు చాలా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటివి మన తెలుగులో చూడలేదు.తన ప్రథుభను క్రిష్ చాలా బాగా ఆవిష్కరించాడు

నటీనటుల పనితీరు:

ముందుగా మనం చెప్పుకోవాల్సింది శాతకర్ణి గురించి (బాలయ్య) ఆయన ఈ సినిమాలో నటించిన తీరు అభినందనీయం ఎందుకంటే ఆయన ఇంతకమునుపు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఓకటి మరొక ఎత్తు .ఈ సినిమా ఈ వయస్సుఓ చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా కష్టపడి,ఇష్టపడి చేశారు బాలయ్య.ఆయన ఎలాంటి డూప్ లేకుండా ఈ సినిమా లో యుద్ధ సన్నివేశాల్లో నటించారు.నటన ఆయనకు ఇలాంటి సినిమాలు చాలా ఈజీ.అలాగే శ్రియా కూడా తన భార్య గా బాగా మెప్పించింది అలాగే అందాలను బాగానే చూపించింది.హేమ మాలిని పాత్ర ఈ సినిమా కు మరొక ప్లస్ ఇలాంటి వాటికి అంత తొందరగా ఎవ్వరూ సూట్ అవ్వరూ కాని ఈ పాత్ర ఆమె కాకుండా వేరే ఎవరైనా చేస్తే బాగోదు అనిపించేలా చేసింది.కబీర్ బేడి విలన్ గా మెప్పించారు మిగతా నటీ నటులు తమ పాత్రలకు తగ్గట్లుగా అలరించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమా కు మొదటగా చెప్పుకోవాల్సింది కెమెరా మెన్ జ్ఞానశేఖర్.ఆయన ఈ సినిమాను చూపించిన తీరు అద్భుతం ఆ కాలం నాటి పరిస్థితులు,సన్ని వేశాలను కళ్ళ కట్టినట్లుగా మనకి అందించాడు.మంచి లోకేషన్స్ ఎన్నుకోవడం తో చాలా బాగా చూపించాడు.అలాగే ఎడిటర్ కూడా చాలా బాగా చేశారు.ఆర్ట్ డైరెక్టర్ కి కూడా మనం అభినధనలు చెప్పాల్సిందే ఇలాంటి సినిమాలకు వేరే సినిమాల పోలిక లేకుండా బాగా చేశారు.సంగీతం అందించిన చిరంతన్ భట్ ఆయన కూడా సినిమా మేజర్ పాయింట్.ఆయన సంగీతం పాటలు చాలా కాలం తర్వాత వినసొపుగా చక్కని తెలుగు తో బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక హైలెట్ అనే చెప్పాలి.

అలాగే నిర్మాతలు ఈ సినిమా ఖర్చు వెనకాడకుండా చాలా మంచి క్వాలిటీ తో తక్కువ సమయం లో తెరకెక్కించారు అంతే ముఖ్యకారణం వారే వారికి కూడా మనం అభినంధించాలి.ఆల్గే డైరెక్టర్ క్రిష్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఈ సినిమా అంత తక్కువ వ్యవ్ధిలో తెరకెక్కించినందుకు ఒక చారిత్రాత్మక కథ అది తెలుగు వారి ఖ్యాతి గురించి మనకు అందించినందుకు బాలయ్య ను హీరోగా ఎనుకుని సగం హిట్ క్ట్టారు.ఆయన ఎన్నుకున్న టీం కూడా అభినంధనీయం.ఒక విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ తన పనితనాన్ని మరొకసారి ఈ సినిమా తో నిరూపించాడు.ఈ సినిమాతో ఆయన పేరు దశదిశలా వ్యాపిస్తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు.

చివరిగా:తెలుగువాడి “చరిత్ర” ను అందరికి తెలిసేలా ఈ సినిమాతో మరొక “చరిత్ర” స్రుష్టించారు .ఈ “చరిత్ర” అయినా మరుగున పడకుండా కొన్ని కాలాల పాటు అందరూ మాట్లాడుకునే విధంగా ఈ సినిమా “చరిత్ర “లు స్రుష్టిస్తుంది,స్రుష్టించాలి అని అందరం కోరుకుందాం.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......