Loading...

ఖైది నెం 150 సినిమా రివ్యూ& రేటింగ్!

a1
చిత్రం:ఖైది నెం 150
నటీనటులు: చిరంజీవి,కాజల్ అగర్వాల్,తరుణ్ అరోర,పోసాని క్రిష్ణ మురళి,ఆలి,బ్రహ్మనందం తదితరులు
నిర్మాతలు:శ్రీమతి సురేఖ,రాంచరణ్
బ్యానర్:కొణిదెల ప్రొడక్షన్ కంపెని
కథ:మురుగదాస్
డైరెక్టర్,స్క్రీంప్లే:వి.వి.వినాయక్
కెమెరా మెన్:రత్నవేలు
ఆర్ట్ డైరెక్టర్:తోట తరణి
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
రచన:పరచూరి బ్రదర్స్,బుర్రా సాయి మాధవ్,వేమా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల క్రితం టాలీవుడ్ ను నెం1 పోజీషన్ లో ఉండి ఎన్నో రికార్డులని క్రియేట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచి సౌత్ లో మోస్ట్ పాపుల హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో ఆయన.కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయడం తో సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.దాదాపు 9 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నరు.ఇక సినిమా కూడా ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా కావడం తమిళం లో హిట్ అయిన కత్తి రీమేక్ కావడం తో అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఆశక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.ఇక ఈ సినిమా ను వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం తో అందరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి.గతం లో ఠాగూర్ లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ కావ్డం అలాగే చరణ్ ఈ సినిమాను నిర్మించడం పెద్ద సాంకేతిక నిపుణులు ఎన్నుకోవడం అలాగే దేవిశ్రీ అందించిన పాటలు సూపర్ హిట్ కావడం ఆయన డ్యాన్సులు ఎలా చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.అయితే అందరూ పెట్టుకున్న ఆశలను ఆయన నిజం చేశారా..లేక నిరాశపరచారా అనేది తెలుసుకోవాలి అంటే ముందు కథలోకి వెళ్దాం….

కథ

కలకత్తలో సెంట్రల్ జైలులో కత్తి శీను కనిపించడం తో సినిమాకథ మొదలవుతుంది.అయితే జైలు నుంచి తప్పించుకున్న శ్రీను హైదరబాద్ వస్తాడు అక్కడినుంచి బ్యాంకాక్ వెళ్దామని నిర్ణయించుకున్న సమయం లో లక్ష్మీ కనబడడం తో ఆగిపోతాడు.అయితే ఆమెను వెతికే ప్రయత్నం లో ఉన్న శ్రీను అనుకోకుండా ఒక వ్యక్తి పై హత్యాయత్నం జరుగుతుంటే చూసి అతన్ని రక్షిస్తాడు ఇక్కడే శీను శంకర్ ను చూసి అచ్చం నాలానే ఉన్నాడు అని ఆశ్చర్యపోతాడు.

అయితే కత్తి శ్రీను ని చూసిన కలెక్టర్ ఇతనే శంకర్ అనుకును రైతులు ఉన్న వ్రుద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడి వారి గురించి శ్రీను తెలుసుకుంతాడు.అగర్వాల్ పేద రైతుల వద్ద భూములని లాక్కుని అక్కడ ఏవో ఇండస్త్రీ లు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.అయితే ఈ సమయం లో రాయలసీమ లోని నీరూరు గ్రామం లోని రైతులు ఆత్మహత్య చేసుకుంటారు.అయితే అది చాలా పెద్ద దుమారం రేపుతుంది.ఇక అగ్ర్వాల్ ఆగడాలకు చెక్ పెట్టాలని శంకర్ వారి తరపున నిలబడతాడు.అయితే అనుకోకుండా శ్రీను లాగా ఉన్న శంకర్ ను చూసి పోలీసులు అతన్ని జైల్లో బంధిస్తారు.

అయితే శంకర్ చేసే పనుల గురించి రైతులకు అన్యాయం చేస్తున్న అగర్వాల్ గురించి అసలు నిజాలు తెలుసుకున్న శ్రీను శనకర్ ప్లేస్ లో ఉండి ఆ రైతుల కు అండగా అగర్వాల్ కు అడ్డుగా నిలబడతాడు.అయితే అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు?లక్ష్మి..,శ్రీనుల ప్రేం చివరకు ఏమయ్యింది అనేది సినిమాలో చూడాల్సిందే..

నటీనటుల పనితీరు:

మెగా స్టార్ పది సంవత్సరాల తర్వాత సినిమాలో నటించడం అసలు ఎలా చేస్తారు,డ్యాన్సులు ఎలా వేస్తారు అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు చిరంజీవి.ఆయన నటనలో,కామెడి టైమింగ్,డ్యాన్సులో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అప్పట్లాగే దీనిలో అందరిని కనువిందు చేశారు.ఈ సినిమా లోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో చిరు నటన ఇరగదీశారు అనే చెప్పాలి.రెండు క్యారెక్టర్లకు ఆయన చాలా వైవిధ్యం చూపించారు.ముఖ్యం గా ఈ సినిమాలో చాలా బాగున్నారు.ముఖ్యం గా లక్స్మీరాయ్ తో చేసిన ఐటం సాంగ్ అయితే అభిమానులకు కన్నులపండుగ అనే చెప్పాలి.ఇక కాజల్ కూడా ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసింది చిరు తో కలసి పోటీగా అలరించింది.విలన్ గా తరుణ్ అరోరా కూడా చాలా బాగా చేశారు తెలుగులో కూడా ఆఫర్లు పెరుగుతాయి.అలాగే ఆలి,పోసాని,బ్రహ్మనందం,ప్రుధ్వి అందరూ తమ పాత్రల మేరకు నవ్వించారు.ఇక ఒక పాటలో చరణ్ చిరు తో కలసి చేసిన స్టెప్ అయితే అభిమానులకు కనువిందే అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు!

ముందుగా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక అందరిని అలరించాడు.ఈ సినిమాలోని రత్తాలు,అమ్మడు కుమ్ముడు,సుందరి సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి,విజువల్ గా కూడా చాలా బాగుంది.ముఖ్యం గా నీరు అనే సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.ఇక ఆయన తన మాస్ బీట్స్ తో,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టారు అనే చెప్పాలి.ఇక రత్నవేలు గురించి చెప్పనక్కర్లేదు ఆ కెమెరా పనితనం గురించి మనకు తెలుసు ఈ సినిమాలో కూడా అందరిని,లోకేషన్స్ ను చాలా బాగా చూపించారు.తోట తరణి కూడా చాలా బాగా చేశారు.అలాగే ఎడిటర్ గౌతం రాజు కూడా బాగా చేశారు కాని కొద్దిగా నిడివి తగ్గించి ఉంటే బాగుండేది.అలాగే రచయితలు పరచూరి బ్రదర్స్,బుర్రా సాయిమాధవ్,వేమా రెడ్డి తమ కలానికి పదును పెట్టారు.ముఖ్యం గా రైతుల గురించి వచ్చే సన్నివేశాలలో రాసిన డైలాగ్స్ అయితే ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.రాంచరణ్ నిర్మాతగా మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా నిర్మాణ విలువలను తగ్గించకుండా ఖర్చుకు వెనకాడలేదు.చాలా బాగా మంచి క్వాలిటీతో సినిమా తెరకెక్కింది అంటే దానికి కారణం ఆయనే.

వినాయక్ ఆయన గురించి ప్రత్యేకం చెప్పాలి.ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమా ఎంతో నిరాశపరచింది.కెరీర్ లో ఎన్నో హిట్లు ఉన్నా చిరు తో ఆయన తీసిన ఠాగూర్ ఎలా పేరు తెచ్చిందీ ఈ సినిమా కూడా మంచి పేరు తెస్తుంది.ఆయన చాలా బాగా డైరెక్ట్ చేశారు మన నేటివిటి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసినా చాలా బాగా కుదిరాయి.దర్శకుడిగా ఆయన విజయం సాధించారు.చిరు కం బ్యాక్ తో ఆయన కూడా బ్యాక్ అనే చెప్పాలి.

బలాలు
చిరంజీవి
కథ.. కథనం
పాటలు.. డ్యాన్సులు
నేపధ్య సంగీతం
ఉద్వేగభరిత సన్నివేశాలు

బలహీనతలు
బలమైన విలన్ పాత్ర లేకపోవటం

మాతృకతో పోలిస్తే మిస్ అయిన ఫీల్‌

చివరిగా:బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ పక్కా మాస్.

రేటింగ్:3/5

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......