Loading...

ఖైది సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ టాక్….ఊహించని కామెంట్లు చేసిన అభిమానులు!

ma2a
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరు నటించిన ఖైది సినిమా పై అటు సిని విశ్లేషకులలో సైతం ఎన్నీ అంచనాకు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు జనవరి 11 తో ఆశ తీరిపోయింది.ఈ సినిమా లో మెగా స్టార్ లుక్ చూసిన తర్వాత అందరూ ఈ సినిమా లో మెగాస్టార్ డ్యాన్సులు ఎలా వేస్తారు,నటన అంతా ఎలా ఉంటుందా అని అందరూ ఆత్రుతగా ఉన్నారు.అయితే ఈ సినిమా ముందుగా అమెరికాలో ప్రీమియర్ లతో ముందుగానే రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా పై అమెరికాలో మెగా అభిమానులతో పాటు అందరూ చూడడం జరిగింది.ఇక అభిమానులు స్పందిసూ మెగాస్టార్ ఈ సబ్జెక్ట్ తీసుకుని చాలా మంచి పని చేశారని ఇది ఆయనకు బాగా సూట్ అయ్యిందని మెచ్చుకున్నారు.అలాగే సినిమాలో చిరు డ్యాన్సులు,ఫైట్స్ అన్నీ బాగా చేశాడని మరొకరు చెప్పారు.సినిమాలో బలమైన విలన్ లేకపోవడం కొంత  మైనస్‌ పాయింట్ అని మరో అభిమాని చెప్పాడు.

కథ, పాటలు, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉన్నాయనీ, డాన్సుల్లో ఇరగదీశాడనీ, నేటి తరం హీరోలు ఎవరూ అన్నయ్య ముందు సాటిరారని మరో అభిమాని కామెంట్ పెట్టాడు. కథలో జోడించిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అంతగా వర్కవుట్ కాలేదనీ, పోసాని, అలీ, చిరు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని చెబుతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ విత్ సెన్సేషనల్ హిట్ అంటూ మరో అభిమాని స్పందించాడు. మొత్తానికి సినిమా పై అందరూ చాలా పాజిటివ్ గా స్పందించడం మెగా అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......