Loading...

ఖైది నెం 150 పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!

a2
టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకుని ఎన్నో ఏళ్ళు నెం 1 హీరోగా ఉన్న చిరంజీవి దాదాపు 9 ఏళ్ళ తర్వాత సినిమా లలో నటించారు.ఇక ఆ సినిమానే ఖైదినెం 150.ఈ సినిమా పై మొదటినుచి భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో చిరు నటన,డ్యాన్సులు,ఫైట్స్ ఎలా చేస్తారో అన్న దానికి సమాధానం ఇచ్చారు.అయితే ఈ సినిమా పై ఉన్న అంచనాలతో చాలా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా ను ప్రదర్శించడం జరిగింది.ఇక ఈ సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు అయితే తమ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు.ఎన్నో ఏళ్ళు కల ఈ రోజు నిరీక్షించడం తో అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు.అయితే వీరి మాట ఎలా ఉన్నా కాని అసలు జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం..

సినిమాలో వచ్చే బీజీఎమ్ ఆద్యంతం అలరించిదని చెబుతున్నారు. ఇంట్రవెల్‌లో వచ్చే ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందట. అయితే ఈ సినిమాలో కామెడీ పండలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లు నటించినా అలరించలేక పోయారట. సందర్భం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ విసుగు తెప్పిస్తాయట.వినాయక్ ఈ సినిమాను నడిపించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.సినిమాకు ఫస్టాప్ హైలెట్ అని ప్రేక్షకులు ప్రేక్షకులు బల్లగుద్ది చెబుతున్నారు.అయితే ఈ సినిమా ఒరిజినల్ కత్తి కి పెద్ద తేడా లేదని సినిమా చాలా బాగుందని వారు అభిప్రాయపడ్డారు.చిరు నటన,డ్యాన్సులు,అన్ని బాగా కుదిరాయి.అయితే కత్తి కు దీనికి కొంత మార్పు చేసినా అది ఫలించలేదని చెబుతున్నారు.ఖైదీ నెం.150 సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు సంబరాలు చేస్తున్నారు. చిరు ఖైదీ నెం.150 సినిమా సంక్రాంతికి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...