Loading...

జగన్ కు దగ్గర బంధువు అయిన నాగార్జున..వచ్చే ఎన్నికల బరిలో నాగ్!

a1

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులలో చాలా పేరు,ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలలో నాగార్జున ఒకరు.ఆయన ఒక ప్రక్క హీరోగానే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా చాలా సక్సెస్ అయ్యారు.అయితే ఎప్పటినుంచో నాగ్ కు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలి కు మంచి అనుభంధం ఉన్న సంగతి మనకు తెలిసిసందే.గతం లో కాంగ్రెస్ తరపున కొన్ని యాడ్స్ చేయడం వై.యస్ వల్ల కొన్ని లాభాలు కూడా ఆయన పొందారు.జగన్ జైల్ లో ఉన్నప్పుడు కూడా ఆయన పరామర్శకు వెళ్ళడం జరిగింది.అయితే అప్పుడే నదరూ నాగ్ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చిన్నా జగన్ కు ఉన్న స్టామినా చూసి తన అవసరం లేదని నాగ్ భావించాడట.

అయితే వారు అనుకున్నట్లుగా పార్టీ గెలవకపోవడం తో కొంచెం డీలా పడినా ఈ సారి జగన్ మాత్రం ఆ చాన్స్ మిస్ చేసుకోకూడని భావిస్తున్నాడట.ఇప్పటికే పార్టీలో పలువురు సీనియర్ ఎమ్యెల్యే లు టి.డి.పి. లోకి షిఫ్ట్ అవ్వడం తో జగన్ కూడా తనకు అనుకూలం గా ఉన్న ఏఅంశాన్ని వదలడం లేదని తెలుస్తుంది.అందుకే నాగ్ ను వచ్చే 2019 ఎన్నికల బరిలో రాజధాని ప్రాంతం లో ఎమ్యెల్యే గా దించాలని భావిస్తున్నాడట ఇక దీనికి నాగ్ కూడా సుముఖం గానే ఉన్నట్లు తెలుస్తుంది.ఇక తన కుమారుడు అఖిల్ కాబోయే భార్య శ్రియా రెడ్డి జివికె మనవరాలు ఆయనకు వై.యస్ ఫ్యామిలీ కు మంచి అనుభంధం ఎప్పటినుంచో ఉంది ఇక ఈ రకం గా కూడా జగన్ ,నాగ్ దగ్గర బంధువులు కాబోతున్నారు.ఇలా అన్నీ కలసిరావడం తోనే నాగ్ ప్రత్యక్ష రాజకీయాలోకి రావాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే సిని,వ్యాపార రంగాలలో మంచి పేరు ఉన్న నాగ్ ఇక రాజకీయం గా కూడా ఒక బలం ఏర్పాటు చేసుకునేనుదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...