Loading...

ఓవర్సీస్ లో మునుపెన్నడూ లేని రికార్డు స్రుష్టించిన ఖైది!

ma1
ప్రస్తుతం టాలీవుడ్ లో ఖైది నెం 150 సినిమా గురించి ఈ సినిమా స్రుష్టించబోయే రికార్డుల గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ సినిమా జనవరి 11 న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా పై ఉన్న భారీ అనచనాల ద్రుష్ట్యా చాలా ఎక్కువ థియేతర్లలో సందడి చేయబోతుంది.ఇక ఈ సినిమా తో మెగా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్.పది సంవత్సరాలు అయినా తన స్టామినా మాత్ర ఏమాత్రం తగ్గలేదు.ఆయన ప్లేస్ ను ఎవ్వరూ సొంతం చేసుకోలేకపోయారు.అయితే ఈ సినిమా ఇండియలో కంటే ఒక్క రోజు ముందే అమెరికాలో ప్రీమియర్ షోల రూపం లో స్క్రీన్ పై హల చల్ చేసింది.అయితే ఎప్పటినుంచో సినిమాలకు దూరం గా ఉన్న చిరు అమెరికాలో కలెక్షన్లు రాబడతాడా అని అనుకుంటున్న సమయం లో ఆయన ఒక్క రోజే ఎంతో మంది హీరోలు ఆశగా చూసే 1 మిలియన్ డాలర్ పైగా వసూళ్ళను రాబట్టి తన స్టామినా అంటే ఏమిటో అందరికి నిరూపించాడు.

ఈ కలెక్షన్లతో ఒక తెలుగు సినిమా అలా ప్రీమియ ర్ షోలకే ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి.ఇంకా బాహుబలి కాకుండా ఇదే రికార్డూ అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది.1 మిలియన్ దాటి సనచలనాలు స్రుష్టిస్తున్నాడు మెగాస్టార్.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...