Loading...

తెదేపా ప్రభుత్వం పై విరుచుకు పడ్డ పవన్…మనుషులు చనిపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు-పవన్

a6
పవన్ కళ్యాణ్ సినిమా రంగం లోనే కాకుండా రాజకీయం గా కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి.తాజాగా ఆయన ఉద్దానం లోని కిడ్నీ భాధితులను కలిసి వారి సమస్యలకు పరిష్కారం అందించాలని ఆయన ఉదానం కు వచ్చారు.అయితే భాధితులు తమ సమస్యలను చెప్పిన అనంతరం పవన్ మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిడ్ని బాధితుల సమస్యలను పరిష్కారించాలనిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.ప్రభుత్వాలు వెంటనే ఈ వ్యాధి ఆవశ్యకతను గుర్తించి.. దీన్ని సరిచేయాలి లేకపోతే చాలా ఘోరం చేసినవాళ్లవుతారంటూ పవన్ చెప్పుకొచ్చారు.పుష్కరాలకు,కొత్త రాజధానికి వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇక్క జనం చనిపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఇది ఒక విపత్తు అని ఆయన అభివర్ణించారు.ఒక్కసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఓట్లు కోసం వచ్చి తర్వాత వీరి గోడు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

అలాగే డబ్బులు లేవు అని అంటున్నారు డీమానిటైజేషన్ తర్వాత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గర చాలా డబ్బులు ఉన్న్నాయని వాటిలో కొంత వీరి కోసం ఖర్చు పెట్టాలని ఆయన సూచించారు.అలాగే ఏపీ రాష్ట్ర వైద్య బడ్జెట్‌ రూ.6వేల కోట్లుగా ఉంది. సర్కార్ తక్షణమే ఉద్దానం సమస్య పరిష్కారం కోసం రూ.100 కోట్లు కేటాయించాలంటూ పవన్ డిమాండ్ చేశారు.అలాగే ఉద్దానం కిడ్నీ సమస్య  పై తక్షణమే ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని ఆయన సూచించారు.అలాగే వీరికి ఏ విధం గా వీరికి మెడికల్ పరంగా, ఆర్థికంగా ఎలా ఆదుకుంటారు అని 48 గంటల్లో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.

తూర్పు ఆంధ్ర ఇంతవెనుక పడు ఉన్నా కాని,రోగాలతో భాధపడుతూ ఉన్న దానిని ఎవ్వరూ జాతీయ  స్థాయిలో తీసుకువెళ్ళకేదు అని ఆయన మండిపడ్డారు.అలాగే ఉద్దనం సమస్యపై జనసేన తరపున 5 మంది కమితీ వేస్తున్ననని 15 రోజుల్లో నివేదిక వస్తుందని తర్వాత ముఖ్యమంత్రి స్వయం గా కలుస్తానని వారికి హమీ ఇచ్చారు.అలాగే జబ్బున పడి చనిపోయి అనాధలైన పిల్లలను ఎలా ఆదుకుంతారు,జబ్బుతో భాధపడుతున్న వారిని ఎలా ఆదుకుంతారు వివరించాలని సూచించారు.ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లని పక్షంలో దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అని పవన్ వ్యాఖ్యానించారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......