Loading...

12 కోట్ల తెలుగువారు గర్వపడేలా ఉంది..శాతకర్ణి పై రాజమౌళి సంచలన కామెంట్స్!

a3
టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిన సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి.ఇక ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ నెల 12 రిలీజ్ అయిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా చూసిన చాలా మంది అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.అంతే కాకుండా క్రిష్ డైరెక్షన్ చాలా బాగుందని తక్కువ సమయం లో ఇలా తెరకెక్కించినందుకు ఆయన హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఇక ఈ రోజు మొదటి షో బాలయ్య,క్రిష్ లతో చూసిన రాజమౌళి కూడా దీనీపి ప్రశంసలు కురిపించాడు.తెలుగువాడు గర్వపడేలా సినిమా తీశారంటూ మెచ్చుకున్నారు.

ఇంత భారీ సినిమాను విజువల్ వండర్‌గా చూపిస్తూనే 79 రోజుల్లోనే పూర్తి చేశారంటే నమ్మశక్యంగాలేదన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత క్రిష్ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని తెలుసుకున్నానన్నారు. 12 కోట్ల మంది భారతీయులు చూసి గర్వించదగ్గ సినిమా అని రాజమౌళి తెలిపారు. సాహో బసవతారకరామ పుత్ర బాలకృష్ణ.మీమల్ని చూసి మేముగర్వపడ్తున్నాము సార్ అంటూ మరో ట్వీట్ చేశాడు.నందమూరి తారకరామారావు గర్వంగా ఫీలయ్యేలా ఈ సినిమాలో బాలకృష్ణ నటించారని రాజమౌళి ట్వీట్ చేశారు. సినిమాపై రాజమౌళి ప్రసంశలో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......