Loading...

రిలయన్స్ జియో మరొక భారీ ఆఫర్!

jjjj

టెలికాం రంగం లోనే ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి సంచలనం స్రుష్టించింది రిలయన్స్ జియో.ఈ సిం వాడే వినియోగదారులకు మొదట 2016 డిసెమబ్ర్ వరకు ఫ్రీ కాల్స్,ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయాలను అందించి చరిత్ర స్రుష్టించింది.ఇక దానిని కూడా పొడిగిస్తూ వచ్చే యేడాది మార్చి 31 వరకు అదే ఆఫర్ ను కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది.దీని దెబ్బతో మిగతా కంపెనీలకు ఏం చేయాలో కూడా తెలీయని పరిస్థితి.అయితే ఇప్పటివరకు 4జి మొబైల్స్ లో మాత్రమే సపోర్ట్ చేసే జియో తొందరలోనే 2జి,3జి ఫోనుల్లో కూడా సపోర్ట్ చేయనుందని ప్రకటించింది.దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇప్పటికీ 2జీ,3జీ ఫోన్లనే వాడుతున్నారు.

దీంతో వారిని ఆకర్షించేందుకు జియో ఈ నిర్ణయం తీసుకుంది. 2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందంటే సిమ్ తీసుకున్న తర్వాత జియోఫై అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత జియో4జీవాయిస్ అప్లికేషన్‌ను మీ 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని గంటల్లో సిమ్ యాక్టివేట్ కాగానే జియో ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, డేటా సేవలను పొందవచ్చు. ముఖేష్ అంబానీ ప్రకటించినంత వేగంగా డేటా సేవలను జియో అందించలేకపోతుందని పెదవి విరుస్తున్నారు. 4జీ ఫోన్లలోనే ఇంత స్లోగా ఉంటే, 2జీ,3జీ ఫోన్లలో ఇంకెంత దారుణంగా ఉంటుందోనని సందేహిస్తున్నారు

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......