Loading...

శాతకర్ణి ప్రీమియర్ టాక్ …సినిమాపై అభిమానుల కామెంట్స్!

a1
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ ఎదురుచూస్తున్న సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి.ఇక ఈ సినిమా అఒఇ భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.అయితే నిన్న విడుదలైన ఖైది సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది ఇక శాతకర్ణి సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ఇండియాలో 12 న రిలీజ్ కాబోతుంటే అమెరికాలో మాత్రం ఒక్క రోజు ముందే 11 వ తారీఖు రిలీజ్ కానుంది.దాదాపు 200 స్క్రీన్స్ లో ఇది హల్చల్ చేయనునంట్లు సమాచారం.అయితే ఈ సినిమా ప్రీమియర్ ను చూసిన అభిమానులు తమ స్పందన ఇలా తెలియ చేశారు.

శాతకర్ణిగా బాలయ్య నటన అదుర్స్ అనీ, డైలాగ్ డెలివరీ, యుద్ధ సన్నివేశాల్లో ఆయన ఇరగదీశారని ప్రేక్షకుడు ఒకరు తెలిపాడు. విజువల్ వండర్‌గా అభిమానులను ట్రీట్ చేయడం గ్యారెంటీ అంటూ మరో ఎన్నారై స్పందించాడు. యుద్ధ సన్నివేశాల్లో కొరియోగ్రఫీని, యాక్షన్ సీన్లు, బాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పంచ్ డైలాగ్స్‌ను మాటల్లో వర్ణించలేమన్నాడు. అచ్చ తెలుగు భాషలో రాసిన మాటలు, డైలాగ్స్.. తెలుగు భాష మాధుర్యాన్ని తెలియజేస్తున్నాయని ఓ సగటు తెలుగు అభిమాని చెప్పాడు. దర్శకుడు క్రిష్, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానంటూ అతడు ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమాల్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోవడం ఖాయమని మరో సినీ అభిమాని తెలిపాడు. సినమాలో మొత్తం నాలుగు యుద్ధాలు ఉన్నాయనీ, అన్నింటినీ ఒకదానికి మరొకటి భిన్నంగా ఉండి.. రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని మరో ఎన్నారై అన్నాడు.బాలయా చెప్పే డైలాగులు వింటుంటే రోమాలు నిక్కబొడ్చుకుంటాయని మరొకరు ట్వీట్ చేశారు. తెలుగు వారి మన్నలన్ పొందడం గ్యారెంటీ అని వారు అంటున్నారు.

Facebook Comments

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......

Loading...