Loading...

గౌతమి పుత్ర శాతకర్ణి రివ్యూ & రేటింగ్!

a2
చిత్రం:గౌతమి పుత్ర శాతకర్ణి
నటీనటులు:బాలక్రిష్ణ,శ్రియ,హేమ మాలిని,శివరాజ్ కుమార్,కబీర్ బేడి తదితరులు
దర్శకత్వం,కథ,స్క్రీన్ ప్లే:క్రిష్
సంగీతం:చిరంతన్ భట్
నిర్మాతలు:వై.రాజీవ్ రెడ్డి,సాయిబాబు జాగర్లమూడి
బ్యానర్:ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
సినిమాటోగ్రఫి: జ్గ్ణానశేఖర్ వీయస్
ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్,రామక్రిష్ణ అర్రం..
బాలయ్య కెరీర్ లో ఇది ఒక మైలు రాయి.99 సినిమాలలో హీరొగా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న బాలయ్య తన 100 వ సినిమా ఎలాంటి కథ ఎన్నుకుంటారా అని ఎదురుచూస్తున్న అందరికి శాకర్ణి కథ ను ఎన్నుకుని అందరిని ఆశ్చర్యపరచాడు.అలాగే డైరెక్టర్ క్రిష్ అని చెప్పదం తో అభిమానులు కూడా ఒకింత షాక్ అయ్యారు అనేది వాస్తవం.ఇక ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ట్రైఅలర్ తోనే చెప్పేశాడు క్రిష్.ఆ ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు అభినంధించకుండా ఉండలేకపోయారు.మరి ట్రైలర్ లో చూసిన అందరూ ఎన్నో ంచనలాను పెట్టుకున్నారు..అయితే క్రిష్ ఆ అంచనాలను అందుకున్నాడా?అందరి ఆశలను నిజం చేశాడా? తెలుసుకోవాలి అంటే కథ లోకి వెళ్దాం..

కథ:
కుంత‌ల దేశాన్ని జ‌యించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి(నంద‌మూరి బాల‌కృష్ణ‌), కోస‌ల దేశంపైకి దండెత్తడానికి సిద్ధ‌మ‌వ‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది.అయితే శాతకర్ణి తన తల్లి గౌతమి బాలాశ్రీ కు ఇచ్చిన మాట కు అనుగుణం గా చాలా మూక్కలు,ముక్కలుగా ఉన్న చిన్న రాజ్యాలను అన్నీటిని కలిపి ఆయన భరత ఖండాన్ని పాలించాలి అనేది శాతకర్ణి కోరిక.అయితే కొంతమంది ఆయనకు సామంతులు అయినా కానిమరికొంతమంది మాత్రం ఆయన తో పని చెయ్యడానికి ఇష్టపడరు.అయితే మరో ప్రక్కన శాతకర్ణి భార్య అయిన వ‌శిష్టికి యుద్దం అంటే అస్సలు నచ్చదు.అయితే తన తల్లి మాట నెరవేర్చేందుకు గాను శాతకర్ణి మొదట సౌరాష్ట్ర రాజు నిహ‌షానుడు(క‌బీర్ బేడి)ని జ‌యించాల‌నుకుంటాడు. అయితే నిష‌శానుడు సైన్యం, బ‌ల‌మైన కోట ఉండ‌టంతో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అత‌న్ని తెలివిగా జ‌యించాలనుకుంటాడు. ఒక వైపు తన భార్య శాతకర్ణి ని యుద్ధాలు చేయవద్దని ఆయనతో విభేదిస్తూ ఉంటుంది.అప్పుడు శాతకర్ణి ఏం చేశాడు?తన తల్లి కోరిక నెరవేర్చాడా లేదా?తన భార్య మాటకు విలువిచ్చాడా లేదా?భరత్ ఖండాన్ని పాలించగలిగాడా లేదా?అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

కథ కూడా మొదలవ్వడం చాలా ఆశక్తిగా ఉంటుంది ఇక ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు అందరిని గుండెకు హత్తుకునేలా ఉంటాయి ఇక మొదటి భాగం లో వచ్చే యుద్ధ సన్ని వేశాలు చాలా బాగుంటాయి అలాగే ఈ సన్నివేశాలలో ఒకటైన సముద్రం లో జరిగే యుద్ధ సన్ని వేశం చాలా కొత్తగా మరియు అందరిని ఆశ్చర్యపరచేలా ఉంటాయి.ఇక శాతకర్ణి తన తల్లి గౌతమి బాలాశ్రీ కు మధ్య వచ్చే సన్ని వేశాలు ముఖ్యం గా తన భార్య మధ్య వచ్చే సన్ని వేశాలు రొమాంటిక్,ఎమోషనల్ రెండూ అందరిని ఆకర్షిస్తాయి.ఇక రెండవ భాగం లో వచ్చే యుద్ధ సన్ని వేశాలు కూడా అందరిని మైమరపిస్తాయి.వీటిని క్రిష్ చాలా వైవిధ్యం గా తెరకెక్కించాడు అప్పటి కాలానికి తగ్గట్లుగా అలాగే ఈ సినిమా నిడివి కూడా 2 గన్ 15 నిముషాలు కావడం కూడా చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.ఎందుకంటే సినిమా ఎక్కడా బోర్ కొట్టడు చాలా ఆశక్తిగా సాగుతూ పోతుంది.అలాగే ఈ సినిమా యుద్ధ సన్ని వేశాలు చాలా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటివి మన తెలుగులో చూడలేదు.తన ప్రథుభను క్రిష్ చాలా బాగా ఆవిష్కరించాడు

ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు కావాల్సిన పెద్ద పెద్ద భవనాలు,వేలాది మంది సైనికులు,కళ్ళు చెదిరే యుద్ధ సన్నివేశాలు,ఆనాటి రాజుల భవంతులు అలాగే ఇలా అన్ని సెట్ చేసుకుని షూట్ చేసి దానికి కావాల్సిన గ్రాఫిక్స్ వర్క్ మొత్త ఇదంతా పూర్తి కావాలి అంతే దాదాపు ఏడాదిన్నర కాలం పడుతుంది అయితే ఈ సినిమా ను కేవలం 7,8 నెలల్లో పూర్తి చేసి అదికూడా క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా క్రిష్ ఈ సినిమాను పూర్తి చేశాడు అంటే ముందుగా ఆయన చేసిన పనికి మనందరం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ఎందుకంటే ఆయన తీసిన సినిమా కథ ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నాటి గూప చరిత్ర దానిని మన తెలుగు వారందరూ కాదు కాదు మన ఇండియా అంతా గర్వపడేలా తెరకెక్కించి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి అర్దమయ్యేలా అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించాడు.

నటీనటుల పనితీరు:

ముందుగా బాలయ్య ఈ సినిమా కథ ను ఎన్నుకున్నందుకు మనం ఆయన హ్యాట్సాఫ్ చెప్పాలి.ఎందుకంటే ఇంత వయస్సులో ఇలాంటి సినిమా చేయడం మాములు విషయం కాదు.అలాంటి యుద్ధ సన్నివేశాలలో నటించాలన్న సినిమాలో ఇంత కష్టపడి చేసిన బాలయ్య కు అభినందనలు.
బాలయ్య ఆయన ఈ సినిమాలో నటించిన తీరు అభినందనీయం ఎందుకంటే ఆయన ఇంతకమునుపు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఓకటి మరొక ఎత్తు .ఈ సినిమా ఈ వయస్సుఓ చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా కష్టపడి,ఇష్టపడి చేశారు బాలయ్య.ముఖ్యం గా ఈ సినిమాలో తన కుమారుడి ని ఒక చేతిలో పెట్టుకుని యుద్ధం లో పాల్గొన్న సన్నివేశాలు అయితే చాలా అద్బుతం.అంతే కాకుండా బాలయా చెప్పే డైలాగులు అయితే అభిమానుల చేత ఈలలు వేయించడం గ్యారెంటీ.ఆయన ఎలాంటి డూప్ లేకుండా ఈ సినిమా లో యుద్ధ సన్నివేశాల్లో నటించారు.

నటన ఆయనకు ఇలాంటి సినిమాలు చాలా ఈజీ.అలాగే శ్రియా కూడా తన భార్య గా బాగా మెప్పించింది అలాగే అందాలను బాగానే చూపించింది. శ్రియా,బాలయ్య లకు మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అభిమానులను అలరిస్తాయి.ఎమోషన్ల్ సీన్స్ లో తనదైన నటన కనబరచింది శ్రియ.అలాగే గౌతమి బాలా శ్రీ గా హేమ మాలిని మెప్పించింది.ఇక ఈ పాత్రలో ఆమె కాకునండా ఎవ్వరూ చేయలేరేమో అన్నట్లు ఆమె చేసింది.హేమ మాలిని పాత్ర ఈ సినిమా కు మరొక ప్లస్ ఇలాంటి వాటికి అంత తొందరగా ఎవ్వరూ సూట్ అవ్వరూ కాని ఈ పాత్ర ఆమె కాకుండా వేరే ఎవరైనా చేస్తే బాగోదు అనిపించేలా చేసింది.కబీర్ బేడి విలన్ గా మెప్పించారు మిగతా నటీ నటులు తమ పాత్రలకు తగ్గట్లుగా అలరించారు.శాతకర్ణి బుర్రకథ చెప్పే వేషం లో శివరాజ్ కుమార్ చాలా బాగా చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని.అంతేకాకుండా ఇది బాలయ్య కెరీర్ లో 100 వ చిత్రం.ఇలా అన్ని ఒత్తిడులను తట్టుకుని క్రిష్ సినిమాను తెరకెక్కించిన విధానం అలాగే యుద్ధ సన్ని వేశాలను కొత్తగా ప్రజెంట్ చేయడం,ముఖ్యం గా కథ కు తగ్గ నటీనటులను,సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడం లో క్రిష్ చాలా సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమా కు మొదటగా చెప్పుకోవాల్సింది కెమెరా మెన్ జ్ఞానశేఖర్.ఆయన ఈ సినిమాను చూపించిన తీరు అద్భుతం ఆ కాలం నాటి పరిస్థితులు,సన్ని వేశాలను కళ్ళ కట్టినట్లుగా మనకి అందించాడు.మంచి లోకేషన్స్ ఎన్నుకోవడం తో చాలా బాగా చూపించాడు.అలాగే ఎడిటర్ కూడా చాలా బాగా చేశారు.ఆర్ట్ డైరెక్టర్ కి కూడా మనం అభినధనలు చెప్పాల్సిందే ఇలాంటి సినిమాలకు వేరే సినిమాల పోలిక లేకుండా బాగా చేశారు.సంగీతం అందించిన చిరంతన్ భట్ ఆయన కూడా సినిమా మేజర్ పాయింట్.ఆయన సంగీతం పాటలు చాలా కాలం తర్వాత వినసొపుగా చక్కని తెలుగు తో బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక హైలెట్ అనే చెప్పాలి.

అలాగే నిర్మాతలు ఈ సినిమా ఖర్చు వెనకాడకుండా చాలా మంచి క్వాలిటీ తో తక్కువ సమయం లో తెరకెక్కించారు అంతే ముఖ్యకారణం వారే వారికి కూడా మనం అభినంధించాలి.ఆల్గే డైరెక్టర్ క్రిష్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఈ సినిమా అంత తక్కువ వ్యవ్ధిలో తెరకెక్కించినందుకు ఒక చారిత్రాత్మక కథ అది తెలుగు వారి ఖ్యాతి గురించి మనకు అందించినందుకు బాలయ్య ను హీరోగా ఎనుకుని సగం హిట్ .ఆయన ఎన్నుకున్న టీం కూడా అభినంధనీయం.ఒక విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ తన పనితనాన్ని మరొకసారి ఈ సినిమా తో నిరూపించాడు.ఈ సినిమాతో ఆయన పేరు దశదిశలా వ్యాపిస్తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్:

బాలయ్య నటన,హేమా మాలిని,శ్రియ
దర్శకత్వం
మ్యూజిక్
కెమెరామెన్
బుర్రాసాయిమాధవ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్

సెకండ్ హఫ్ లో కొద్దిగా నెమ్మదించడం(ఇది ఇక వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి కొద్దిగా అందరికి ఏమొషనల్ సన్నివేశాలు విసుగు తెప్పించవచ్చు)

చివరిగా: తెలుగువాడి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన బసవతారక పుత్ర బాలక్రిష్ణ ,క్రిష్ అభినందనలు .శాతకర్ణి సినిమాలో బాలయ్య నట విశ్వరూపమే చూపించాడు.

రేటింగ్: 4/5

Facebook Comments
Loading...

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ , పొలిటికల్ న్యూస్ , హెల్త్ న్యూస్ మరియు గోషిప్స్ కోసం మా క్రింది FaceBook పేజీని లైక్ చేయండి.......